# Tags

Vyuham Teaser: ‘వ్యూహం’ సినిమాపై కూడా ప్రెస్ మీట్ పెట్టాలి కదా అంబటి గారూ!

Vyuham: రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ టీజర్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

Vyuham Teaser:అంబటి రాంబాబు… 2019లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఓ ఎమ్మెల్యే మాత్రమే. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ కి ఆయనో కట్టప్ప. ప్రభుత్వంపై ఈగ వాలిన సరే ప్రెస్ మీట్ లు పెట్టి మరి స్వామి రుణం తీర్చుకుంటూ ఉంటారు. జల వనరుల శాఖ మంత్రిగా సంబంధిత శాఖపై పట్టు ఉందో లేదో కానీ.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేయడంలో మాత్రం దిట్ట. మొన్నామధ్య జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan)నటించిన ‘బ్రో’ సినిమాలో ఓ సన్నివేశం తనని ఇమిటేట్ చేస్తూ పెట్టారంటూ ప్రెస్ మీట్ పెట్టి క్లాస్ తీసుకున్నారు. అసలు తనదో కాదో తెలియని ఓ పాత్ర పై ఆయన పెట్టిన శ్రద్ధ ఏపీలోని ప్రాజెక్టులపై పెట్టిన వచ్చే ఎలక్షన్స్ లో ఓట్లు అడిగే దానికి ఓ అర్థం ఉండేది. తన పాత్రని ఉపయోగించి ‘బ్రో’ నిర్మాతలు వసూళ్లు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేసిన అంబటి కి.. రాంగోపాల్ వర్మ రీసెంట్ గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీస్తున్న ‘వ్యూహం’ సినిమా మాత్రం కనిపిస్తున్నట్లు లేదు. ఆ సినిమా నుంచి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్ అయ్యాయి. ఆ రెండింటిలోనూ జగన్మోహన్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తేస్తూ మిగతా పొలిటికల్ క్యారెక్టర్స్ అన్నింటిని నెగిటివ్ గా చూపించారు. అందులో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి విలీనం చేసిన సందర్భాలని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.

ఇక రెండో టీజర్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని చపాతి చీల్చినంత ఈజీగా విడగొట్టినట్లు చూపించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, చిరంజీవి తో సహా కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ జగన్మోహన్ రెడ్డిని తొక్కేసేందుకు వ్యూహాలు రచించినట్లు చూపించారు. ప్లాన్ ప్రకారమే జగన్ ని జైలుకు పంపించినట్లు అందులో సీన్స్ క్రియేట్ చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చేతులు కట్టుకొని ఇతర పార్టీ నేతల ముందు నిల్చుకున్నట్లు చూపించారు.అయితే ఇవేవీ అంబటి మంత్రి అంబటి రాంబాబుకు కనిపిస్తున్నట్లు లేదు. సినిమాలో తనని ఇమిటేట్ చేస్తూ ఓ సీన్ పెట్టారని నానా యాగి చేసిన రాంబాబు ఇప్పుడు ఇంతమంది క్యారెక్టర్స్ ని కించపరుస్తూ తీసిన ‘వ్యూహం’పై ఎందుకు మాట్లాడటం లేదో ఆయనకే తెలియాలి. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద రచ్చే జరుగుతోంది. ‘బ్రో’ అట్టర్ ఫ్లాప్ అంటూ దీని కలెక్షన్స్ పై ఢిల్లీకి కూడా వెళ్తానంటూ సవాల్ చేసిన మంత్రి.. వ్యూహంలో చిరంజీవి, పవన్ క్యారెక్టర్ల చిత్రీకరణ పై సమాధానం చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ సినిమా తీస్తున్న వర్మనైతే ఓ ఆట ఆడేసుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు ‘యాత్ర’ పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీసిన వర్మ.. ఈసారి ఎలక్షన్స్ కి ముందు పొలిటికల్ మైలేజ్ కోసం ‘వ్యూహం’ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తీయడానికి ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వర్మకి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల విజయవాడ బ్యారేజ్ పై ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని గంటలపాటు ట్రాఫిక్ ఆపేసి జనాల్ని ఇబ్బందులకు గురి చేశారు. ఇలాంటివన్నీ ఏపీ మంత్రులకు కరెక్ట్ అనిపిస్తాయో ఏంటో మరి!.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *