# Tags

Vijay Devarakonda: పెళ్లయ్యాక నా లైఫ్ ఆ పాటలా ఉండాలి

Vijay Devarakonda: పెళ్లయ్యాక నా లైఫ్ ఆ పాటలా ఉండాలి: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) -సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి (Kushi) . ఇటివలే ఈ సినిమాకు సంబంధించి ఇటివల ప్రేమ గీతం.. ఆరాధ్య విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా పాటను లింక్ చేస్తూ విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘ఆరాధ్య పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. పెళ్లయ్యాక ఏడాదిపాటు జంట ఎలా ఉంటుందో ఈ పాటలో చూపారు. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ఈ పాట తెలియజేస్తోంది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ.. పెళ్లయ్యాక లైఫ్ ఈ పాటలో చూపిన విధంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు. విజయ్ తన వైవాహిక జీవితం గురించి చెప్పడంతో ఆసక్తి నెలకొంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట నా రోజా నువ్వే.. కూడా ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *