# Tags

Varuntej: లావణ్య కి నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా.. వరుణ్ తేజ్

వైసీపీ సొంత సర్వే.! జనసేనకి 15 శాతం పైనే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej) తన లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకి కాబోయే భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న ‘గాండీవధారి అర్జున’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు.

‘ మా ప్రేమ మొదలై ఐదేళ్లు దాటింది. మొదట చాలాకాలం మేమిద్దరం ఫ్రెండ్స్ లా ఉన్నాం. తను నాకు అన్ని విధాల నచ్చి నేనే తనకి ఫస్ట్ ప్రపోజ్ చేశా. ఇప్పటికీ తనే నా బెస్ట్ ఫ్రెండ్. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. కేరింగ్ పర్సన్. నా ఇష్టాల గురించి తనకి బాగా తెలుసు. ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పటికే చాలా గిఫ్ట్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ కూడా అలాంటిదే. నా వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడను. అందుకే మా ప్రేమ విషయం ఇన్ని రోజులు దాచాల్సి వచ్చింది. మా ప్రేమ గురించి చెప్పగానే మా ఇద్దరి కుటుంబాలు అంగీకరించాయి. ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేసుకోవాలనుకుంటున్నాం’ అని అన్నారు.

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న లావణ్య, వరుణ్ కొంతకాలం కిందట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వీరిద్దరూ కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో నటించారు.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *