# Tags

Varun Tej: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ పోస్టర్.. రిలీజ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

Varun Tej: మెగాస్టార్ బర్త్ డే..! స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

 

Varun Tej: మెగా (Mega) ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోయాయి. రేపు చిరంజీవి (Chiranjeevi) సినిమా అంటేనే ముందురోజు నుంచే హంగామా షురూ చేసే ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజుకు కూడా అంతే సందడి చేస్తారు. ఆరోజు రానే వచ్చింది. ఆగష్టు 22 వారికి పండుగ. దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ.. చిరంజీవికి బర్త్ డే విషెష్ చెప్తారు. ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టుగా ఒక పోస్టర్ (సీడీపీ) కూడా విడుదల చేశారు. చిరంజీవి నట ప్రస్థానంలోని అనేక పాత్రలను సూచిస్తూ దీనిని రూపొందించారు.

ఈ పోస్టర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ.. ‘ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఆయన సీడీపీ విడుదల చేయడం సంతోషంగా ఉంది’ అని తన వాల్ లో రాసుకొచ్చారు. పోస్టర్ లో ‘హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి.. ది గాడ్ ఫాదర్ ఆఫ్ టీఎఫ్ఐ’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ మెగాభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *