# Tags

Tamannaah: తమన్నా వచ్చాక నో డేటింగ్ పాలసీకి చెక్ పెట్టా: విజయ్ వర్మ

Tamannaah: తమన్నా వచ్చాక నో డేటింగ్ పాలసీకి చెక్ పెట్టేసా: విజయ్ వర్మ

 

Tamannaah: ‘తమన్నా (Tamannaah) నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా ఆలోచనా విధానమే మారిపోయింది. తనలోని పాజిటివ్ థింకింగ్ అద్భుతమ’ని నటుడు విజయ్ వర్మ (Vijay varma) అన్నాడు. విజయ్ వర్మ-తమన్నా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చాడు.

‘నేను సినీ రంగానికి చెందిన ఎవరినీ ప్రేమించకూడదని సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అనుకునేవాడిని. పరిశ్రమపై కోపమే కారణం. తమన్నాను కలిశాక నా ఆలోచనే మారిపోయింది. కళ, వ్యాపార రంగమే కాకుండా విశాల దృక్పథం ఉన్నవారు మన జీవితాల్లోకి వస్తే ఎంత బాగుంటుందో అర్ధమైంది’.

‘తమన్నా కోసం నా డేటింగ్ రూల్స్  మార్చుకున్నాను. తన ఆలోచనలు, సినీ అనుభవం, మంచితనం, సహృదయత ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఇవి నాకూ మేలు చేస్తాయి. ఒక్కోసారి ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన దానిపై బాధపడితే ఆ మాటల వెనక అర్ధాన్ని.. నా ఆలోచనని తమన్నా మార్చేస్తుంది. అదే ఆమెలోని పాజిటివిటీ’ అని తమన్నాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *