# Tags

గంజాయితో దొరికిపోయిన బిగ్‌బాస్ ఫేం షణ్ముక్.. అన్న కోసం వెళితే తమ్ముడు చిక్కాడు..!

Shanmukh Jawanth arrested

బిగ్‌బాస్ ఫేం షణ్మకు జస్వంత్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి ఫ్లాట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. గంజాయి, డ్రగ్స్ లభించాయి. అతడి అన్న కోసం పోలీసులు వెళ్లగా.

 

బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ గంజాయితో పట్టుబడ్డాడు. ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవటం కోసం వెళితే.. ఊహించని విధంగా షణ్ముక్ గంజాయితో చిక్కాడు. షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్‌కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా.. అక్కడ గంజాయి, డ్రగ్స్ లభించాయి. దీంతో అన్నదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌కు వైజాగ్‌కు చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం నిశ్చితార్ధం అయింది. సదరు యువతి డాక్టర్ కాగా.. ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడ్డారు. తల్లికి ట్రీట్‌మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా.. మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తనతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా.. మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాద్‌లోని తమ్ముడు షణ్ముక్ ఫ్లాట్‌లో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అక్కడకు వెళ్లారు.

అయితే ఆ సమయంలో సంపత్ వినయ్ అక్కడ లేదు. ముందుగానే ఇంటి నుంచి పరారయ్యాడు. పోలీసులు షణ్ముక్ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించగా.. డ్రగ్స్‌తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. అన్న కేసు విచారణ కోసం వెళ్లిన పోలీసులకు తమ్ముడు షణ్ముకు అనుకోని విధంగా చిక్కాడు. దీంతో పాలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరో చోట అతడి అన్న సంపత్ వినయ్‌ను కూడా అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. నెల క్రితమే షణ్ముక్‌ ఓ హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన యాక్సిడెంట్‌ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలటంతో లక్కీగా తప్పించుకున్నాడు. డ్రగ్స్, గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు ఉక్కుపాదం మోపుతుండగా.. షణ్ముక్ గంజాయితో పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *