# Tags

Sharwanand: శర్వానంద్ కు బిగ్ ఆఫర్..! ఇద్దరు సూపర్ స్టార్స్ తో మూవీ..

Sharwanand: శర్వానంద్ కు బిగ్ ఆఫర్..! ఇద్దరు సూపర్ స్టార్స్ తో మూవీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

Sharwanand: యువ హీరో శర్వానంద్ (Sharwanand) అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ప్రముఖ హీరోలు అమితాబ్ బచ్చన్ (amitabh bachan) , రజినీకాంత్ (Rajinikanth) కలిసి నటిస్తున్న ఓ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రజినీకాంత్ హీరోగా తమిళ దర్శకుడు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇదే సినిమాలో ఓ యువ హీరో పాత్రకు ఎందరో పేర్లు పరిశీలించి శర్వానంద్ పేరు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

దీంతో శర్వానంద్ కు మంచి అవకాశం దక్కిందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయి. రజినీకాంత్ జైలర్ సక్సెస్ లో ఉన్నారు. ప్రస్తుతం హిమాలయాల యాత్రలో ఉన్న రజినీకాంత్ త్వరలో ఈ సినిమా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇది ఆయనకు 170వ సినిమా. దాదాపు 32 ఏళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్-రజినీకాంత్ కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. రజినీకాంత్ ప్రస్తుతం ఆయన కుమార్తె దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *