# Tags

Samantha: ‘బ్రేక్.. తప్పేమీ కాదు..’ సమంత పోస్ట్ వైరల్..! నెట్టింట చర్చ

Samantha: ‘బ్రేక్.. తప్పేమీ కాదు..’ సమంత పోస్ట్ వైరల్..! నెట్టింట చర్చ

 

Samantha: టాప్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం రాజ్ అండ్ డీ (Raj & Dk) కే దర్శకత్వంలో సిటాడెల్ (ఇండియన్ వెర్షన్)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సిటాడెల్ షూటింగ్ పూర్తి కావడంతో కీలక పోస్ట్ చేసింది. ‘సిటాడెల్ (Citadel) ఇండియన్ వెర్షన్ షూటింగ్ పూర్తి చేశా. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా. మనకు ఏం రాసుందో తెలీనప్పుడు బ్రేక్ తప్పుగా అపిపించదు’.

‘రాజ్, డీకే నాకు కుటుంబంతో సమానం. సమస్యను ధైర్యంగా పోరాడటంలో వీరెంతో తోడ్పడ్డారు. అందుకు వీరికి ధన్యవాదాలు. నా లైఫ్ లో గుర్తుండిపోయే పాత్ర ఇచ్చారు. మరో మంచి పాత్ర నాకోసం రాసే వరకూ ఇదే నా బెస్ట్’ అని పేర్కొన్నారు.

బ్రేక్ అని పోస్ట్ చేయడంతో కెరీర్ కు సంబంధించినదేనా..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత కెరీర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోనుందని.. మయోసైటిస్ తో బాధ పడుతున్న ఆమె చికిత్సకు విదేశాలకు వెళ్లనుందని ఇటివల వార్తలు వచ్చాయి. దీంతో ఆమె పోస్ట్ వైరలవుతోంది. విజయ్ దేవరకొండతో ఖుషిలో కూడా సమంత నటిస్తోంది.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *