# Tags

RK Roja: మంత్రి రోజాగారూ.! అడుక్కోవడమంటే ఏంటి.?

రాజకీయాల్లో రోజా జబర్దస్త్ కామెడీ.! తగ్గేదే లే.!

రాజకీయాల్లో రోజా జబర్దస్త్ కామెడీ.! తగ్గేదే లే.!

RK Roja: సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి, మెగాస్టార్ చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచమని అడుక్కున్నారంటూ చిరంజీవి సహా, గతంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ పరిశ్రమ తరఫున విజ్ఞప్తి చేసిన రాజమౌళి, ప్రభాస్, మహేష్ తదితరులపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు రోజా చేయడం పెను దుమారానికి కారణమవుతోంది.

అడుక్కోవడమేంటి.? ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా, సినీ పరిశ్రమ సమస్యలపై, పరిశ్రమ తరఫున విజ్ఞప్తి చేయడం అనేది ఓ హక్కు. ఆ విజ్ఞప్తి పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయా.? తిరస్కరిస్తాయా.? అన్నది వేరే చర్చ.

ప్రజాస్వామ్యం, వ్యవస్థలు, బాధ్యతలు, హక్కులు.. వీటి మీద కనీసపాటి అవగాహన లేనివాళ్ళు మంత్రులుగా పదవుల్లో వుండడం వల్ల తలెత్తుతున్న దుస్థితి ఇది.! సరే, చిరంజీవి సహా, రాజమౌళి, మహేష్‌బాబు, ప్రభాస్ తదితరులు అడుక్కోవడానికే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరకు వెళ్ళారని అనుకుందాం.!

మరి, రోజా చేసిందేంటి.? కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళారామె. అదీ మంత్రి పదవి వచ్చాక. ‘నాకు మంత్రి పదవి వచ్చాక, చిరంజీవిగారి ఇంటికి రావడం ఆనందంగా వుంది..’ అంటూ ఉప్పొంగిపోయారామె అప్పట్లో.

చిరంజీవి సతీమణి వండి, వడ్డించిన వంటకాల్ని రోజా సహా ఆమె కుటుంబ సభ్యులంతా ఆరగించారు. ‘కావాల్సింది అడిగి, చేయించుకుని తినేంత చనువు చిరంజీవి ఇంట్లో తనకు వుంది’ అని కూడా చెప్పుకున్నారు రోజా. ఇప్పుడు ఆ చిరంజీవి మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రోజా ఎలా చేయగలుగుతున్నారు.?

తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అనాలా.? అడుక్కుతినడం అనాలా.? అని రోజాపై, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ‘చిరంజీవిగారూ.. మీ వల్లనే.. మీ మంచితనం వల్లనే.. కొందరు ఇలా తయారవుతున్నారు. దయచేసి అలాంటివాళ్ళని, మీ గేటు బయటే ఆపెయ్యండి..’ అని చిరంజీవికి కూడా ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

‘నా ఇంటికి వచ్చినవాళ్ళని నేను గౌరవిస్తాను.. అది నా పద్ధతి..’ అని చిరంజీవి పదే పదే చెబుతుంటారు. ఆ పద్ధతి, ఆయనకు మంచి పేరు తీసుకురావడంలేదు.. అడ్డమైనోళ్ళూ ఆయన్ని అడ్డగోలుగా విమర్శించేలా చేస్తోంది.! పైగా, ఆయన పెట్టింది పీకల్దాకా మెక్కినోళ్ళు, ఆయన్ని విమర్శిస్తుండడం.. అభిమానులకు అస్సలు రుచించడంలేదు.!

The post RK Roja: మంత్రి రోజాగారూ.! అడుక్కోవడమంటే ఏంటి.? appeared first on TeluguBulletin.com.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *