# Tags

Renu Desai: పవన్ గురించి నిజాలు చెప్పి నిందలు పడుతున్నా: రేణూ దేశాయ్

Renu Desai:

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

Renu Desai: ఇటివల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ (Renu Desai) వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఆమె విడాకుల అంశంపై చేసిన అభ్యంతరకర కామెంట్ కు రేణు సరైన సమాధానం ఇచ్చారు. దీంతోపాటే ఆమె కొంత భావోద్వేగానికి గురయ్యారు. ‘నన్ను కామెంట్ చేయడంలో మీకు ఆనందం వస్తుందనుకుంటే అలానే చేయండి. పవన్ వ్యతిరేకించే వారి నుంచి నిందలు పడటం నా జీవిత లక్ష్యంలా మారిపోయింది’ అని అన్నారు.

‘పవన్ తో విడాకుల గురించి చెప్తే ఆయన అభిమానులు నన్ను ద్వేషించారు. ఇప్పుడు ప్రయాణానికి మద్దితిస్తుంటే పవన్ వ్యతిరేకులు నన్ను తిడుతున్నారు. విడాకుల విషయంపై మాట్లాడి ఆయన వ్యతిరేకుల నుంచ డబ్బు తీసుకున్నానని గతంలో ఆరోపించారు.. ఇప్పుడు పవన్ మద్దతుదారుల నుంచి డబ్బు తీసుకుని మద్దతిచ్చానని వ్యతిరేకులు అంటున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ నేను నిజమే చెప్తున్నాను. ప్రేమించినందుకు, నిజాలు మాట్లాడుతున్నందుకు నిందలు పడుతున్నాను. ఇది నా విధిరాత’ అని అన్నారు.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *