# Tags

Manchu Vishnu: పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. నేనేం బ్రహ్మంగారినా అంటూ మంచు విష్ణు కామెంట్

Manchu Vishnu: పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. నేనేం బ్రహ్మంగారినా అంటూ మంచు విష్ణు కామెంట్

మంచు విష్ణు జిన్నా టీజర్ రిలీజ్ పై అప్డేట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. దీంతోపాటు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan)గురించి మాట్లాడారు. పవన్ ఏపీ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా? అని ఎదురైన ప్రశ్నకి మంచు విష్ణు ఇలా సమాధానం ఇచ్చారు.

‘ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పడానికి నేనే బ్రహ్మంగారిని కాదు. ఆయన రాజకీయాల్లో సక్సెస్ అవుతారా లేదా అనేది చెప్పలేను. సినిమాల్లో ఆయన సూపర్ స్టార్. అందులో అనుమానమే లేదు. ఒక సినిమా నిరాశపరిచిన కూడా మరో సినిమా తో వసూళ్ల సునామి తెప్పించడం ఆయన స్టైల్. ప్రజలు నచ్చిన సినిమా చూస్తారు. నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సిపి నే అధికారంలోకి వస్తుందనిపిస్తోంది. మళ్లీ జగనే సీఎం అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా సర్వేలు కూడా అదే మాట చెప్పాయి. చివరి ఆరు నెలల కాలం ఎన్నికలకి చాలా ముఖ్యమైనది’ అని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు.

The post Manchu Vishnu: పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. నేనేం బ్రహ్మంగారినా అంటూ మంచు విష్ణు కామెంట్ appeared first on TeluguBulletin.com.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *