# Tags

Kodali Nani: చిరంజీవిని విమర్శిస్తే జరిగే డ్యామేజ్ నాకు తెలుసు: కొడాలి నాని

Kodali Nani: చిరంజీవిని విమర్శిస్తే జరిగే డ్యామేజ్ నాకు తెలుసు: కొడాలి నాని

 

Kodali Nani: ‘చిరంజీవి (Chiranjeevi) గారిని విమర్శిస్తే రాజకీయంగా మాకేం జరుగుతుందో తెలియదా..? నేను ఆయన్ను విమర్శించుంటే నిరూపించాల’ని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) అన్నారు. గుడివాడలో జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

‘చిరంజీవి గారికి నేనేమన్నానో అర్ధం కాదా..? నేనేం మాట్లాడానో చిరంజీవి అభిమానులకూ తెలుసు. నాకూ ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవిని అనేకసార్లు కలిశా. ప్రజారాజ్యం సమయంలో నా కార్యాలయం ముందు వెళ్తుంటే చేతులెత్తి నమస్కరించాను కూడా. నా దగ్గర ఉన్నవాళ్లలో 60శాతం మంది చిరంజీవి గారి అభిమానులే. నేను ఆయన్ను విమర్శిస్తే వీరు బాధపడరనే విషయం నాకు తెలీదా..?’.

‘చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడ్ని కాను. నా మాటల్ని వక్రీకరించి జనసేన, టీడీపీ నాయకులు చిరంజీవికి, మాకూ మధ్య దూరం పెంచాలనే గుడివాడ రోడ్లపై దొర్లారు. ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు.. పాటిస్తాం. డ్యాన్సులు, నటన రానివాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలని మాత్రమే అన్నాను. నేనీ విషయంలో క్లారిటీగానే ఉన్నాన’ని అన్నారు.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *