# Tags

Kartikeya: చిరంజీవి స్థాయి తెలీకుండా విమర్శిస్తుంటే బాధగా ఉంది: కార్తికేయ

Kartikeya: చిరంజీవి స్థాయి తెలీకుండా విమర్శించడం బాధగా ఉంది: కార్తికేయ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

Kartikeya: చిరంజీవి (Chiranjeevi) ని ఎవరైనా విమర్శిస్తే తనకు బాధేస్తుందని హీరో కార్తికేయ (Kartikeya) అన్నారు. తాను నటించిన కొత్త సినిమా బెదుర్లంక 2012 (Bedurulanka 2012) ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చిరంజీవి సాధించిన కీర్తి, హిట్స్, చూసిన ఒడిదుడుకులు, మమ్మల్ని ఇన్ స్పెయిర్ చేసిన విధానం ముందు ఒక ఫ్లాప్ పెద్ద విషయం కాదు. ఎవరెస్ట్ శిఖరం అంత ఇమేజ్ చిరంజీవిగారికి ఉంది. ఆయన మళ్లీ హిట్స్ ఇస్తారు. ఇలా గతంలో చాలాసార్లు జరిగింది. సినిమా ఫ్లాప్ అయితే నేరం అన్నట్టు చూడటం తగదు’.

‘సినిమా బాలేకపోతే బాలేదని చెప్పొచ్చు. ఆయన చేసే సినిమాల గురించి ఆయనకు తెలీదా..? జయాపజయాలు ఈ రంగంలో సహజం. కొందరు చిన్న మనస్తత్వాలు ఆయన స్థాయి తెలీకుండా విమర్శించడం సరైన పద్దతి కాదు. చిరంజీవి మళ్లీ కొత్త సినిమాపై దృష్టి పెడతారని నాకనిపిస్తుంద’ని అన్నారు.

సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఆగష్టు 25న సినిమా విడుదలవుతోంది. యుగాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది. వినోదం, హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నార’ని అన్నారు.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *