# Tags

Janasena Vs TDP: జనసేన వర్సెస్ టీడీపీ.! తెలుగు తమ్ముళ్ళ అత్యుత్సాహం వెనుక.!

Janasena Vs TDP: జనసేన వర్సెస్ టీడీపీ.! తెలుగు తమ్ముళ్ళ అత్యుత్సాహం వెనుక.!

 

సోషల్ మీడియా వేదికగా, జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ.. ఈ రెండు పార్టీల మధ్యా పోరు గట్టిగా సాగుతోంది. ప్రధానంగా టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు, సోషల్ మీడియా వేదికగా స్పేస్‌లు పెడుతున్నారు. జనసేన పార్టీని తిట్టిపోస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా విభాగానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్నవారు.. అధికార ప్రతినిథుల స్థాయి వున్నవారు కూడా ఈ స్పేస్‌లలో పాల్గొంటూ, జనసేనని తూలనాడుతున్నారు.

2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయాలన్న ఓ ప్రతిపాదన దిశగా చర్చలు జరుగుతున్నమాట వాస్తవం. సీట్ల పంపకాల విషయమై త్వరలో చర్చలు జరగాల్సి వుంది కూడా. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది జనసేన వ్యూహం. వాస్తవానికి, జనసేనతో పొత్తు కోసం మొదట ప్రయత్నాలు ప్రారంభించిందే టీడీపీ.!

ఎప్పుడైతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేనాని వ్యాఖ్యానించారో.. ఆ తర్వాత నుంచి, ‘జనసేన మా దగ్గరకే వస్తుంది లే..’ అన్నట్లుగా టీడీపీలో కొందరు వ్యవహరించడం మొదలు పెట్టారు. కింది స్థాయిలో పరిస్థితులేంటో, సమీకరణాలేంటో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తెలుసు.

కానీ, టీడీపీ అను‘కుల’ మీడియా సాయంతో, జనసేన స్థాయిని తగ్గించేందుకు చంద్రబాబే ప్రయత్నిస్తున్నారు.. పార్టీ శ్రేణుల్నీ జనసేన మీదకు ఎగదోస్తున్నారు. ‘బ్రో’ సినిమా సమయంలో కావొచ్చు, ఆ తర్వాత కావొచ్చు, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు టీడీపీ వైపు నుంచి సోషల్ మీడియా వేదికగా రావడం వెనుక పెద్ద కథే వుంది.

చిరంజీవిని టార్గెట్‌గా చేసుకుని, టీడీపీ సోషల్ మీడియా వేస్తున్న వెకిలి వేషాల వెనుక, టీడీపీ అధినేత చంద్రబాబు అల్పబుద్ధి కూడా కీలక పాత్ర పోషించిందన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పుడే ఇలా వుంటే, ముందు ముందు.. అంటే, ఎన్నికల నాటికి కింది స్థాయిలో టీడీపీ – జనసేన మద్య ఓట్ల షేరింగ్ ఎలా జరుగుతుంది.?

విపక్షాలిలా కొట్టుకు ఛస్తోంటే, అది అధికార పక్షానికే లాభమని టీడీపీ గ్రహించకపోతే ఎలా.? జనసేనాని సంయమనం పాటిస్తున్నారు.. చాలామంది జనసేన నేతలూ నిగ్రహంతో వున్నారు. టీడీపీ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. అయినా, టీడీపీ అత్యుత్సాహం ఆగకపోతే, 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారొచ్చు.!

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *