# Tags

పంచాయితీ ఎన్నికల్లో ఓటుకి ఐదు వేలు.!

పంచాయితీ ఎన్నికల్లో ఓటుకి ఐదు వేలు.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ‘మేమే గెలిచాం’ అని చెప్పుకుంటున్నాయి. ఎవరెన్ని గెలిచారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఒక్కటైతే సుస్పస్టం, అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది.! జనసేనతో జతకడితే తప్ప, టీడీపీ రాజకీయంగా నిలబడలేని పరిస్థితిని పంచాయితీ ఎన్నికలు నిరూపించాయి.

ఆయా పార్టీల మద్దతుదారులు మాత్రమే ఈ పంచాయితీ ఎన్నికల్లో నిలబడతారు. పార్టీల గుర్తులుండవ్.! సాధారణంగా, అధికార పార్టీ మద్దతుదారులే గెలుస్తుంటారు పంచాయితీ ఎన్నికల్లో. కానీ, భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయిప్పడు.

సరే, ఎవరు గెలిచారు.? అన్నది వేరే చర్చ. ఎలా గెలిచారు.? అన్నది మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశమే. అధికార వైసీపీ, ఈ పంచాయితీ ఎన్నికల కోసం భారీగానే ఖర్చు చేసింది. అధికార పార్టీ నేతలు, ఓటర్లకు డబ్బులు పంచుతూ మొబైల్ ఫోన్లలోని కెమెరాలకు చిక్కారు.

ఏకంగా ఐదు వేల రూపాయల వరకు ఒక్క ఓటుకీ పంచారు అధికార పార్టీ నాయకులు. ఓ పంచాయితీలో ఏకంగా 50 లక్షల పైన ఖర్చు చేశారంటే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు. ఇంత ఖర్చు చేసినా, గెలిచాక.. సదరు వ్యక్తికి కలిగే ‘లాభం’ ఏంటి.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

పంచాయితీ ఎన్నికలకే.. అది కూడా కొన్ని పంచాయితీలకు మాత్రమే జరిగిన ఎన్నికలకే పరిస్థితి ఇలా వుంటే, సార్వత్రిక ఎన్నికల సంగతేంటి.? ఒక్క ఓటుకీ ఇప్పుడు ఐదు వేలు పంచుతున్నారంటే, సార్వత్రిక ఎన్నికల్లో పది వేలు పంచాయినా సరిపోతుందా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు అత్యంత ఖరీదైనవి కాబోతున్నాయ్.!

ఏ రాజకీయ పార్టీ అయినాసరే.. ఈసారి పదిహేను వేలు ఆ పైన పంచాల్సిందేనని, జనబాహుళ్యంలో చర్చ జరుగుతోంది.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *