# Tags

Chiranjeevi Helping Hand: పత్తి రైతులకు సాయం.. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు విరాళం.. ఇదీ ‘చిరంజీవి’తం

Chiranjeevi Helping Hand: పత్తి రైతులకు సాయం.. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు విరాళం.. ఇదీ ‘చిరంజీవి’తం

చిరంజీవి అంటే తెరపై నటించే నటుడే కాదు.. మానవతా మూర్తి ఎన్నోసార్లు రుజువైన నిజం. చిరంజీవి గారు చేసే గుప్త దానాలు ఎవరికీ తెలియవని ఆయన సన్నిహితులు ఎందరో చెప్పిన మాట. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనే కాదు.. ఆపదలో ఉన్న ఏ సందర్భమైనా ఆయన వరకూ చేరిన విషయాన్ని స్వయంగా తెలుసుకుని సాయం అందించడం చిరంజీవికి ఉన్న గొప్ప లక్షణం అని.. ప్రతిరోజూ ఎందరికో సాయం చేస్తారని నటుడు రాజా రవీంద్ర ఎన్నోసార్లు చెప్పారు. నటుడిగా తనను ఆదరించిన ప్రజలకే కాదు.. పరిశ్రమలో అహర్నిశలు కష్టపడే కార్మికులనైనా ఆదుకునే గొప్ప మానవతావాది చిరంజీవి. సోషల్ మీడియా యుగంలో ఆయన చేసే గుప్త దానాలు తెలియకున్నా.. మీడియా అంతగా లేని రోజుల్లోనే చిరంజీవి చేసిన ఆర్ధికసాయం వార్తల్లో నిలిచింది.

1998లో చిరంజీవి యముడికి మొగుడు సిల్వర్ జూబ్లీ వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఆ సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన పత్తి రైతులు పంట నష్టంతో ఆర్ధికంగా నష్టపోయారు. విషయం తెలుసుకుని రైతులను అదే కార్యక్రమానికి పిలిచి రూ.2లక్షల ఆర్ధికసాయం అందించారు చిరంజీవి. 5,10 పైసలు కూడా చెల్లుబాటయ్యే రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. 1989లో ఆయన సహ నిర్మాతగా తెరకెక్కించిన రుద్రవీణ సినిమాకు నర్గీస్ దత్ అవార్డు లభించింది. జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అప్పటి రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. కేంద్రం ప్రకటించిన రూ.30వేలకు తాను మరో రూ.20వేల రూపాయలు కలిపి మొత్తం రూ.50వేల రూపాయలను నర్గీస్ దత్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు విరాళంగా ఇస్తున్నట్టు అదే వేదికపై ప్రకటించి తన ఉన్నత మనసుని చాటుకున్నారు చిరంజీవి.

తన సినిమాల ఓపెనింగ్ షోలకు వచ్చిన అభిమానులు ప్రమాదవశాత్తూ మరణించిన సమయాల్లోనూ చిరంజీవి వారి కుటుంబాల్ని ఆదుకున్నారు. ఠాగూర్ సినిమా విడుదల సమయంలో రాజమండ్రి, మంగళగిరి, మాచర్ల ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాటల్లో మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్ధికసాయం అందించారు. 1996 ఏడాది గోదావరి వరద బీభత్సానికి కోనసీమ జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి ప్రాంతం బాగా నష్టపోయింది. ఆ సమయంలో చిరంజీవి స్పందించి అక్కడకు డాక్టర్ల బృందాన్ని.. లారీల్లో బియ్యం, నిత్యావసరాలు, దుస్తులు, పిల్లల కోసం పాల డబ్బాలు పంపించారు. ఊరికి ఊరికి సంబంధం లేకుండా బిక్కుబిక్కు మంటున్న నిరాశ్రయులకు చిరంజీవి చేసిన సాయం ఎందరినో ఆదుకుంది. చిరంజీవి చేసిన ఇటువంటి ఉన్నత సేవా కార్యక్రమాలు ఆయనకు ‘శ్రీరామరక్ష’లా నిలిచాయి.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *