# Tags

Chiranjeevi Helping Hand: అభిమాని వైద్యం కోసం ఎయిర్ ఆంబులెన్స్..! చిరంజీవి నిబద్ధతకు నిదర్శనం..

Chiranjeevi Helping Hand: అభిమాని వైద్యం కోసం ఎయిర్ ఆంబులెన్స్..! చిరంజీవి నిబద్ధతకు నిదర్శనం..

Chiranjeevi Helping Hand: అభిమాని వైద్యం కోసం ఎయిర్ ఆంబులెన్స్..! చిరంజీవి నిబద్ధతకు నిదర్శనం..

చిరంజీవి సంపాదించుకున్న ఆస్తి అభిమానులు. ఈ విషయాన్ని చిరంజీవి ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై చెప్పారు. అభిమానులే ఆయనకు ఎనర్జీ. అటువంటి అభిమానులపై చిరంజీవి చూపే ప్రేమ ఉన్నతమైనది. సంఘంలో హీరో అభిమానులు అంటే ఒక గౌరవం తీసుకొచ్చారు. అటువంటి అభిమానులకు చిరంజీవి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తారు. 3ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కమ్మేసింది. ఎందరో కరోనా బారిన పడ్డారు. వారిలో మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అత్యవసర చికిత్స ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆర్ధికసాయం ఏదైనా.. ఆపత్కాలంలో వారిని ఆదుకుని అభిమానులపట్ల నిజంగానే ఆపద్భాందవుడు అయ్యారు. ఫ్యాన్స్ యోగక్షేమాలు రోజూ తెలుసుకునేవారు. రాష్ట్రం నలుమూలల ఉన్న అభిమానుల సమాచారం సేకరించారు.

గాజువాకకు చెందిన చిరంజీవి అభిమాని కె.శ్రీనివాసరావు, ఆయన భార్య కోవిడ్ సమయంలో వైరస్ బారిన పడ్డారు. వారు చికిత్స తీసుకునేందుకు ఆసుపత్రిలో బెడ్ దొరకలేదు. స్పందించిన చిరంజీవి స్థానికంగా అపోలో, సురక్షా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి శ్రీనివాసరావు చికిత్సకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసి భార్యాభర్తలకు చెరో 1లక్ష ఆర్ధికసాయం కూడా అందించారు. వారి యోగక్షేమాలను డాక్టర్లను ఫోన్లో సంప్రదించి తెలుసుకునేవారు. శ్రీకాకుళంకు చెందిన మరో మెగాభిమాని శ్రీనివాసరావు కోవిడ్ బారిన పడ్డారు. చికిత్స తీసుకున్నారు. అయితే.. శ్రీనివాసరావు బిల్ కట్టలేని పరిస్థితులు తెలుసుకున్న చిరంజీవి వెంటనే 1లక్ష ఆర్ధికసాయం అందించి ఆయన్ను ఆదుకున్నారు.

అమలాపురం ప్రాంతంలోని కె.పెదపూడి గ్రామానికి చెందిన యర్రా నాగబాబు కూడా కరోనాతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. నాగబాబు విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆయన్ను కాకినాడ తరలించి డాక్టర్ కిరణ్ బృందంతో మెరుగైన వైద్యం అందే ఏర్పాట్లు చేశారు. నిత్యం నాగబాబు ఆరోగ్యం విషయంపై వాకబు చేశారు. ఆరోగ్యం క్షీణించిందనే విషయం తెలుసుకుని ఎయిర్ ఆంబులెన్స్ ఏర్పాటు చేసి నాగబాబును లంగ్స్ ట్రాన్స్ ఫర్ కోసం అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. 20రోజులు చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో దురదృష్టవశాత్తూ యర్రా నాగబాబు మృతి చెందారు. అభిమాని మృతిపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

The post Chiranjeevi Helping Hand: అభిమాని వైద్యం కోసం ఎయిర్ ఆంబులెన్స్..! చిరంజీవి నిబద్ధతకు నిదర్శనం.. appeared first on TeluguBulletin.com.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *