# Tags

Chiranjeevi: ‘మంచి నటి, ఫ్రెండ్’ సుమలతకు చిరంజీవి బర్త్ డే విషెష్

Chiranjeevi: ‘మంచి నటి, స్నేహితురాలివి’ సుమలతకు చిరంజీవి బర్త్ డే విషెష్

Chiranjeevi: ‘మంచి నటి, స్నేహితురాలివి’ సుమలతకు చిరంజీవి బర్త్ డే విషెష్

Chiranjeevi: ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సుమలత (sumalatha) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi). ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సుమలతకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. వయసులో మీరు మరో ఏడాది పెద్దవారయ్యారని కాదు.. మీలోని ప్రజ్ఞకు ఒక ఏడాది పెరిగిందని. మీరు మరింత మానసికంగా ధృఢంగా ఉన్నారని.. ఇంకా మంచి మనసుతో ఉన్నారని  అర్ధం. సినిమాలైనా, రాజకీయాలైనా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చేసే పనిలో రాణించాలని ప్రయత్నించారు. ఈ ప్రయాణంలో ఎంతో దయ, ధృడంగా ఉన్నారు’.

‘మీరు గొప్ప మహిళ. అద్భుతమైన మనిషి. మీరు ఎందరికో ప్రేరణనిచ్చారు. మీరు మంచి కోస్టార్, అంతకుమించి స్నేహితురాలు. మీరు మరింత సంతోషకరమైన జీవితం, ఆరోగ్యంగా ఉండాలి. మీరు జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తూ ఇటువంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాన’ని అన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్, నెటిజన్లకు కూడా సుమలతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి-సుమలత కలిసి.. ఆలయ శిఖరం, శుభలేఖ, ఖైదీ, వేట, చట్టంతో పోరాటం, స్వయంకృషి, పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్ తదితర సినిమాల్లో నటించారు.

The post Chiranjeevi: ‘మంచి నటి, ఫ్రెండ్’ సుమలతకు చిరంజీవి బర్త్ డే విషెష్ appeared first on TeluguBulletin.com.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *