# Tags

Chiranjeevi Birthday Special: చిరంజీవి గాత్రం.. ఎన్నో సినిమాలకు వరం..

Chiranjeevi Birthday Special: చిరంజీవి గాత్రం.. ఎన్నో సినిమాలకు వరం..

ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుని.. తనకు తానే శిఖరమంత ఇమేజ్ సాధించుకున్న హీరో.. చిరంజీవి. తెలుగు సినిమాల్లో చిరంజీవి పేరు మంత్రంలా మార్మోగింది. ఎన్నో.. ఎన్నెన్నో సినిమాల్లో ఆయన రిఫరెన్సులు ఎందరో హీరోలు, దర్శక, నిర్మాతలకు అవసరమయ్యాయి. ఆయన ఫొటో ఒక్క సీన్ లో కనిపించినా.. ఆయన పేరు వినిపించినా వాళ్ల సినిమాకు ఓ గౌరవం. చిరంజీవి సాధించుకున్న పేరు ఇదే. ఎన్నో సినిమాలకు ఆయన వాయిస్ ఓవర్ రూపంలో కూడా ప్రత్యక్షంగా సహకారం అందించారు.

హనుమాన్ అనే కార్టూన్ బేస్డ్ సినిమా ఆంజనేయస్వామి గాధతో తెరకెక్కింది. పిల్లలకు ఆంజనేయుడి కథను అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఆ ఆంజనేయుడి భక్తుడు, చిన్నారులకు ఇష్టమైన చిరంజీవి పరోక్షంగా బలమయ్యారు. సినిమా ఆద్యంతం ఆయన వాయిస్ ఓవర్ తో అలరించారు.

వాయిస్ ఓవర్ తో మెప్పించి..

అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో పెళ్లి ఇతివృత్తాన్ని తనదైన శైలిలో వర్ణిస్తూ గాత్రదానం చేశారు మెగాస్టార్. ఆధ్యాత్మిక భావన అందరికీ చేరువయ్యేలా తెరకెక్కిన జగద్గురు ఆదిశంకరాచార్యులు సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అల్లు అర్జున్ ముఖ్యపాత్రలో వచ్చిన రుద్రమదేవి సినిమాకు చిరంజీవి ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. గుంటూరోడు సినిమాకు కూడా చిరంజీవి తనదైన శైలిలో గాత్రం అందించారు. సబ్ మెరైన్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఘాజీ సినిమాలో చిరంజీవి గంభీరమైన వాయిస్ తో సినిమాను ముందకు నడిపించారు. మోహన్ బాబు హీరోగా వచ్చిన సన్ ఆఫ్ ఇండియాకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిన భారీ సినిమా బ్రహ్మాస్త్రకు చిరంజీవి తన గంభీరమైన గాత్రం అందించి సినిమా సక్సెస్ లో భాగమయ్యారు.

సినిమాకు బలమై నిలిచి..

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్, 1,2 భాగాలకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ కాలం నాటి పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రంగమార్తాండ.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు చిరంజీవి అందించిన వాయిస్ ఓవర్ మేకింగ్ వీడియో సంచలనాన్నే రేపింది. రంగస్థల కళాకారుల జీవితాల్ని ఉద్దేశిస్తూ చిరంజీవి పలికిన డైలాగులు అద్భతం అనిపించాయి. టీవీ రంగంలోనూ చిరంజీవి తనదైన ముద్ర దేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో హోస్ట్ గా తనదైన చలాకీతనం, హుషారుతో ఎపిసోడ్స్ అన్నింటినీ రక్తి కట్టించారు. ఇలా చిరంజీవి తెరపై నటనతోనే కాకుండా తెర వెనుక వాయిస్ కూడా ఇచ్చి ఆయా సినిమాల్లో భాగమయ్యారు.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *