# Tags

Chiranjeevi Birthday Special: చిరంజీవా మజాకా..! 6ఏళ్లు వరుస ఇండస్ట్రీ హిట్లు.. కెరీర్లో 9..

Chiranjeevi Birthday Special: చిరంజీవా మజాకా..! 6ఏళ్లు వరుస ఇండస్ట్రీ హిట్లు.. కెరీర్లో 9..

Chiranjeevi Birthday Special: చిరంజీవా మజాకా..! 6ఏళ్లు వరుస ఇండస్ట్రీ హిట్లు.. కెరీర్లో 9..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. స్టార్ హీరోగా మారిన తర్వాత ఆయన్నుంచి ఇండస్ట్రీ వరుసగా వచ్చాయి. ప్రతి దశకం (80,90,2000,2010)లో కూడా ఇండస్ట్రీ హిట్ ఉన్న ఏకైక హీరో చిరంజీవి. తనదైన మాస్ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, కామెడీ స్కిల్స్ తో అప్పటి జనరేషన్లో జెట్ స్పీడుతో దూసుకెళ్లారు. ఓ దశలో చిరంజీవి వరుసగా ఆరేళ్లు.. ఏడాదికో ఇండస్ట్రీ హిట్ సాధించడం ఇప్పటికీ చెరగని రికార్డుగా మిగిలిపోయింది. 1983లో తెలుగు సినిమా దశను కీలక మలుపు తిప్పిన ఖైదీ చిరంజీవికి కూడా ఓ గేజ్ చేంజర్ మూవీ. తెలుగు ప్రేక్షకులు చిరంజీవి విరోచితమైన నటనకు మంత్రముగ్దులైన సినిమా. ఫలితంగా ఈ సినిమా చిరంజీవి కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

1980 నుంచి 90ల వరకూ..

1987లో వచ్చిన పసివాడి ప్రాణం చిరంజీవి కెరీర్లో కీలకమైన మూవీ. చిన్నారులను చిరంజీవికి దగ్గర చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. షిఫ్టులతో కలిపి 500 రోజులకు పైగా రన్ అయిన సినిమా. 1988లో వచ్చిన యముడికి మొగుడు సినిమా చిరంజీవి మాస్ పొటెన్షియాలిటీని నిరూపించిన సినిమా. ఫైట్స్, డ్యాన్స్, కామెడీతో తెలుగు ప్రజలను పూర్తిగా తన వైపుకు తిప్పుకున్నారు. 1989లో వచ్చిన అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమా చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. గడుసరి అత్తను దారిలో పెట్టిన అల్లుడి పాత్రలో చిరంజీవి అలరించారు. 1990లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి తెలుగు సినీ చరిత్రలోనే ఓ క్లాసిక్ గా నిలిచింది. చిరంజీవి హీరోయిజం, శ్రీదేవి అందం, కథ చిరంజీవిని తిరుగులేని స్టార్ గా మార్చాయి.

1990 నుంచి 2020ను దాటి..

1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిరంజీవిని తిరుగులేని మాస్ హీరో, మెగాస్టార్.. తెలుగు సినిమాకు శాస్వత నెంబర్ వన్ హీరోగా మార్చేసిన మరో ఇండస్ట్రీ హిట్. 1992లో వచ్చిన ఘరానామొగుడు తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి 10కోట్ల షేర్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు రాష్ట్రాన్ని ఊపేశాయి. తర్వాత పదేళ్లకు.. 2002లో వచ్చిన ఇంద్ర. చిరంజీవి స్టామినాను మరోసారి చాటిచెప్పింది. ప్రతి ఏరియాలో కొన్నేళ్లపాటు నిలిచిపోయే రికార్డులు సృష్టించింది. అనంతరం సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత చేసిన ఖైదీ నెంబర్ 150 నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సినీ వర్గాల లెక్కల ప్రకారం చూడాలని ఉంది, ఠాగూర్, వాల్తేరు వీరయ్య సినిమాలు మార్జిన్ లో ఇండస్ట్రీ హిట్ స్టేటస్ మిస్సయ్యాయని చెప్పాలి.

The post Chiranjeevi Birthday Special: చిరంజీవా మజాకా..! 6ఏళ్లు వరుస ఇండస్ట్రీ హిట్లు.. కెరీర్లో 9.. appeared first on TeluguBulletin.com.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *