# Tags

Chiranjeevi: పచ్చ జాగిలాలు.! ‘భోళా శంకరుడి’పై ఎందుకిలా మొరుగుతున్నాయ్.?

Chiranjeevi: పచ్చ జాగిలాలు.! ‘భోళా శంకరుడి’పై ఎందుకిలా మొరుగుతున్నాయ్.?

Chiranjeevi: సక్సెస్, ఫెయిల్యూర్.. సినిమాకి సర్వసాధారణం.! తెలిసి ఎవరూ డిజాస్టర్ సినిమాలు తీయరు. సక్సెస్ ఫార్ములా ఏంటో తెలిస్తే, అసలంటూ ఫెయిల్యూర్ సినిమాలెందుకు వస్తాయ్.? తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. మిగతా సినీ పరిశ్రమల్లో ఇంకా తక్కువ.

పదుల్లో కాదు, వందల్లో సినిమాలు వచ్చినా, నిఖార్సయిన హిట్ సినిమాలంటే వేళ్ళ మీద లెక్కపెట్టేలా వుంటాయ్. ఉద్ధండులైన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు.. ఫ్లాపులు చవిచూసినోళ్ళే. ఎక్కడో చాలా అరుదుగా మాత్రమే. ఫ్లాపులెరుగని పరిస్థితి చాలా తక్కువ మంది విషయంలో జరుగుతుంది. రాజమౌళి పేరు ఈ లిస్టులో ముందుంటుంది.

‘భోళా శంకర్’ సినిమా ఫలితం మీద, ఆ సినిమా రిలీజ్‌కి వారం పది రోజుల ముందే కొన్ని కుల జాగిలాలు, రాజకీయ జాగిలాలు దుష్ప్రచారం మొదలు పెట్టాయి. అప్పటినుంచీ.. ఆ ఏడుపు అలా అలా కొనసాగుతూనే వుంది.

ఈ సినిమాకి సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో ఇంటర్వ్యూలోని కొన్ని బైట్స్ తీసుకొచ్చి, ‘పచ్చ జాగిలం ఒకటి’, ‘చిరంజీవే మొత్తం చేశారు’ అని నిరూపించేందుకు పడరాని పాట్లూ పడుతోంది.

దాంతోపాటు, ఇంకో పచ్చ జాగిలానిదీ అదే పద్ధతి. నిర్మాతకీ, హీరోకీ మధ్యన చిచ్చు పెట్టేందుకు నానా రకాల ప్రయత్నాలూ చేస్తోంది. కక్కిన కూడుకి ఆశపడ్డంలో ఆ పచ్చ జాగిలాలకి సాటి ఇంకెవరూ రారేమో.! ఆగండాగండీ, ఇక్కడ కొన్ని బులుగు జాగిలాలూ వున్నాయ్. పచ్చ జాగిలాలకు మించి.. నికృష్ట పాత్రికేయం చేస్తున్నాయ్.

అసలు, ‘భోళా శంకర్’ మీద ఈ పోస్టుమార్టమ్ దేనికి.? చిరంజీవి మీద నిందారోపణలు చేసి ఏం సాధిస్తారు.? సినిమా అంటే, జయాపజయాలకు అందరూ బాధ్యులే. చిరంజీవి ఎప్పుడూ ఫలానా సినిమా క్రెడిట్ తనదని చెప్పలేదు. వైఫల్యం వచ్చినప్పుడు, ధైర్యంగానే ఒప్పేసుకుంటారు. తదుపరి జాగ్రత్త పడతాననీ చెబుతుంటారు.

దర్శకుడు మెహర్ రమేష్ అనే వ్యక్తి గతంలోనూ డిజాస్టర్లు ఇచ్చాడు.. ఇప్పుడు ఆయన్నుంచి ఇంకో డిజాస్టర్ వచ్చి వుండొచ్చు. అది అతని నేరం కాదు. ఈ సినిమా చేయడం చిరంజీవి నేరమూ కాదు. సినిమా వర్కవుట్ అవలేదంతే. సినిమా రంగంలో సుదీర్ఘ అనుభవం వున్న చిరంజీవి, సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకోవడం తప్పెలా అవుతుంది.?

రంకు రాజకీయం అంటాం.. అలా, దీన్నిప్పుడు రంకు పాత్రికేయం అనాలేమో.! ఔను, లేకపోతే సినిమా విషయంలో ఇంత రాద్ధాంతమా.? నిర్మాతకి లేని నొప్పి.. సదరు జాగిలాలకి ఎందుకు.? కుల జాడ్యం కాకపోతే.. రాజకీయ పైత్యం కాకపోతే.. తమకు ఎంగిలిమెతుకులు వేసే యజమానుల కళ్ళలో ఆనందం చూడ్డానికి కాకపోతే.. చిరంజీవి మీద ఇంత ద్వేషం ప్రదర్శించి ఏం సాధిస్తారు.?

మొరిగే కుక్కల మూతి పగలగొట్టే సక్సెస్‌లు కొట్టడం చిరంజీవికి కొత్త కాదు.! ఏనుగు వెళుతుంటే, గ్రామ సింహాలు మొరుగుతుంటాయ్ అన్న విషయం చిరంజీవికి తెలుసు. ఆయన మౌనం, ఈ జాగిలాలు మొరిగేందుకు ఆస్కారమిస్తోందంతే.! ఇంత ఛండాలం.. ఇంత పాత్రికేయ వ్యభిచారం.. ఇంకేదన్నా హీరో నటించిన డిజాస్టర్ సినిమా మీద ప్రదర్శిస్తే.. అది వేరేలా వుంటుంది.!

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *