# Tags

Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు సంబరాలు..! సీసీటీలో ఘనంగా హోమాలు, పూజలు

Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు సంబరాలు..! సీసీటీలో ఘనంగా హోమాలు, పూజలు

Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు సంబరాలు..! సీసీటీలో ఘనంగా హోమాలు, పూజలు

Chiranjeevi: మెగాభిమానులకు పండుగ రోజు.. మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు. ఆరోజు రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. అఖిల భారత చిరంజీవి యువత నేడు, రేపు విశేష కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా శ్రీ వారాహి మహా యజ్ఞం, శ్రీ భగళా ముఖీ అమ్మవారి ఆరాధన కార్యక్రమాలు చేపట్టింది. చిరంజీవి సోదరి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust) సీఎంఓ డాక్టర్ శ్రీమతి మాధవి (Madhavi) గారు ఆద్యంతం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ వారాహి మహా యజ్ఞం కార్యక్రమాన్ని దేవీ ఉపాసకులు శ్రీ లక్షణరావు గురూజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మధ్యాహ్నం నుంచి శ్రీ భగళా ముఖీ అమ్మవారి ఆరాధన కార్యక్రమం జరిగింది. చిరంజీవి గారు, వారి కుటుంబసభ్యులు శతాయుష్షులుగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యాగం జరిపించారు.

అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు, చిరంజీవి చారిటబుల్ ట్రస్టు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్వామినాయుడు పూజ, యాగం ఏర్పాట్లు అన్నింటినీ పర్యవేక్షించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

The post Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు సంబరాలు..! సీసీటీలో ఘనంగా హోమాలు, పూజలు appeared first on TeluguBulletin.com.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *