# Tags

Chiranjeeevi: చిరంజీవి బర్త్ డే..! మెగా ఫ్యాన్స్ విశేష కార్యక్రమాలు షురూ..

Chiranjeeevi: చిరంజీవి బర్త్ డే..! మెగా ఫ్యాన్స్ విశేష కార్యక్రమాలు షురూ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు. ఆగస్టు 22 కోసం ఆగస్టు 23 నుంచే.. (మళ్లీ ఏడాది పుట్టినరోజు కోసం) ఎదురు చూసే అభిమానం అది. ప్రతి ఏటా ఘనంగా అభిమానులే సంఘటితమై తమ అభిమాన హీరోకు జరిపే వేడుక ఇది. ఈసారి కూడా గత ఏడాదికి మించి ఏర్పాట్లు చేశారు మెగా ఫ్యాన్స్.

Evoto

చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో 21వ తేదీన శ్రీ వారాహి మహా యజ్ఞం, శ్రీ భగళా ముఖీ అమ్మవారి ఆరాధన కార్యక్రమం, 22వ తేదీన శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇవి కాకుండా 22వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ హాలులో చిరంజీవితో పని చేసిన దర్శకులు, ఆయనను ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన నటీనటులు, అభిమానులతో భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేదిక నుంచే చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేలా కార్యక్రమం రూపొందించారు.

Chiranjeeevi: చిరంజీవి బర్త్ డే..! మెగా ఫ్యాన్స్ విశేష కార్యక్రమాలు షురూ..

ఈ సందర్భంగా చిరంజీవికి సంభందించిన లేటెస్ట్ ఫోటోలు హై క్వాలిటీతో విడుదల చేశారు అభిమానులు. ఈ కార్యక్రమాలన్నీ అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా జరుగబోతున్నాయి. ఇందుకు సంబంధించి అభిమానులకు ఇన్విటేషన్ కార్డు కూడా రూపొందించారు. చిరంజీవి ఘనత తెలిపేలా ఆహ్వాన పత్రిక తయారు చేయించారు. దీంతో చిరంజీవి పుట్టినరోజు సంబరం.. 3 రోజుల ముందే మెగా అభిమానుల్లో మొదలైపోయింది.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *