# Tags

Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ‘కర్ర’ పెత్తనం.!

Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ‘కర్ర’ పెత్తనం.!

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. అన్నది వెనకటికి ఓ సామెత.! అసలు విషయంలోకి వస్తే, ఇటీవల టీటీడీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన గతంలో కూడా టీడీ ఛైర్మన్‌గా పని చేశారు. అప్పట్లోనే ఆయన మీద నానా రకాల ఆరోపణలూ వచ్చాయి.

టీటీడీ ప్రతిష్ట దిగజారడానికి బీజం పడిందే భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో.. అంటారు కొందరు. సరే, అది వేరే చర్చ. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, వార్తల్లో వ్యక్తిగా మారారు. అదీ, ‘కర్ర’ పెత్తనం’ విషయంలో.!

అసలు విషయమేంటంటే, తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్ళే భక్తుల్ని పులుల భయం వెంటాడుతోంది. ఓ చిన్నారిని చిరుతపులి ఇటీవల చంపేసింది, మెట్లమార్గంలో. టీటీడీ భద్రతా వైఫల్యానికి ఇది నిదర్శనం.

వన్యమృగాలు సంచరించే ప్రాంతాలు గనుక, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వుండాలి. ఆ జాడే కనిపించడం లేదంటూ గత కొన్నాళ్ళుగా భక్తులు వాపోతున్నారు. టీటీడీ అంటే, రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రం అన్నది ఇప్పటి మాట కాదు. వీఐపీల సేవలో తరిస్తుస్తోంది టీటీడీ యంత్రాంగం గత కొంతకాలంగా.

అను నిత్యం, కొండపైన అధికార పార్టీ నేతల హల్‌చల్.. వారికి ప్రోటోకాల్ సహా, అదనపు సౌకర్యాలు, మర్యాదలు.. ఇలా నడుస్తోంది వ్యవహారం. అబ్బే, అదేం లేదని ప్రభుత్వం, టీటీడీ, వైసీపీ బుకాయించొచ్చుగాక.. అది వేరే సంగతి. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ, భక్తుల భద్రతని టీటీడీ గాలికొదిలేసింది. దానికి నిదర్శనమే, చిరుత దాడిలో చిన్నారి మృతి.

టీటీడీ తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో.. కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇన్నోవేటివ్‌గా ఆలోచించారు. ఇకపై భక్తులకి కర్రలు అందస్తారట. ఒక్కో భక్తుడి చేతికీ ఒక్కో కర్ర ఇచ్చి.. నడక దారిలో వెళ్ళమని చెబుతారట.

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీరు. లేకపోతే, చేతిలో కర్ర చూసి, క్రూర మృగాలు పారిపోతాయా.? ఇంతకీ, ఆ కర్రలకి వైసీపీ రంగులేస్తారా.? వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో కర్రలు కొనుగోలు చేయాలి.. ఆ కాంట్రాక్టులు ఎవరికి కట్టబెడతారు.? ఇంతకీ, ఈ ఊత కర్ర లేదా చేతి కర్రల పథకానికి ‘జగనన్న ఊత లేదా చేత కర్ర’ అని పేర్లేమైనా పెడతారా.? పెట్టినా పెడతారు.! అంతా జగన్మాయ.!

దీన్ని కర్ర పెత్తనం అనొచ్చా.? అనాల్సిందేనేమో.! దేవుడేంటి.? భక్తి ఏంటి.? ప్రజలేంటి.? వారి భద్రతేంటి.? వన్యప్రాణులేంటి.? వాటి మనుగడేంటి.? ఇవన్నీ అనవసరం.! అడ్డగోలు నిర్ణయాలు.. ఆపై పబ్లిసిటీ స్టంట్లు.! దేవుడితో పరాచకాలు.! భక్తులతో ఆటలు.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి.?

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *