# Tags

అయ్యయ్యో.! ‘మెగా’ చిచ్చురేపాలనుకున్నారు.. బొక్క బోర్లా పడ్డారు.!

అయ్యయ్యో.! ‘మెగా’ చిచ్చురేపాలనుకున్నారు.. బొక్క బోర్లా పడ్డారు.!

అయ్యయ్యో.! ‘మెగా’ చిచ్చురేపాలనుకున్నారు.. బొక్క బోర్లా పడ్డారు.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి తొలుత ‘స్టైలిష్ స్టార్’ అని చిరంజీవి పేరు పెడితే, ఆ ‘స్టైలిష్ స్టార్’ అనే పేరుని తీసేసి, ‘ఐకాన్ స్టార్’ అని తనకు తానే కొత్త పేరుని అల్లు అర్జున్ పెట్టుకున్నాడన్నది కొందరి ఆరోపణ.

చిరంజీవి ఒకప్పుడు సుప్రీం హీరో.. ఇప్పుడు మెగాస్టార్.! నాగార్జున కూడా యువసమ్రాట్.. ఆ తర్వాత కింగ్.! ఇలాంటివి మామూలే.! ఈ మార్పుల్లో వింతేమీ లేదు. ‘పుష్ప’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం ప్రకటితమైతే, అక్కడి నుంచి ‘గొడవ’ మొదలు పెట్టారు కొందరు.

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య గొడవల కోసం.. చిరంజీవి – అల్లు అర్జున్ మధ్య గొడవల కోసం, పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ మధ్య గొడవల కోసం.. నానా రకాల ప్రయత్నాలూ చేశారు. కానీ, వారి ప్రయత్నాలు వృధా అయ్యాయి.! దాంతో, ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. అల్లు అర్జున్ మీద పొగడ్తలు కురిపిస్తూ, చిరంజీవి అలాగే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పేలిన ట్విట్టర్ హ్యాండిల్స్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించేశాయి.

అల్లు అర్జున్ మీదకు రివర్స్ అయిపోయి, అసలు అల్లు అర్జున్ నటుడే కాదంటూ.. కొత్త రచ్చ మొదలు పెట్టాయి. పైగా, ఇవన్నీ బాలకృష్ణ మద్దతుదారులు అలాగే జూనియర్ ఎన్టీయార్ మద్దతుదారుల ముసుగులో జరిగిన తతంగాలు.

ఆరా తీస్తే, లక్షలు ఖర్చు చేసి మరీ, మెగా కాంపౌండ్ మీద విషం చిమ్మడానికి కొందరు తెరవెనుకాల ఈ ప్రయత్నాలు చేశారని తేలిందట. నిజమేనా.? ఏదో పైశాచికానందం కోసం పనీ పాటా లేని కొందరు నెటిజన్లు, ట్రోలింగ్‌ చేస్తుంటారుగానీ.. డబ్బు కోసం కక్కుర్తి పడి ఇలా చేస్తారా.?

ఏం, ఎందుకు చెయ్యరు.? ఫోన్ పే గొర్రెలున్నాయ్.. గూగుల్ పే గొర్రెలు కూడా వున్నాయ్. ఒక్కో ట్వీటుకీ ఇంత మొత్తంలో.. అని రాజకీయ పార్టీలు చెల్లింపులు చేయడం తెలిసిన విషయమే.

ఎప్పుడైతే, చిరంజీవి స్వయంగా అల్లు అర్జున్‌ని కలిసి ఆత్మీయంగా అభినందించారో.. ఆ తర్వాత, అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా మారిపోయాయి చాలా ట్విట్టర్ హ్యాండిల్స్. మేటర్ స్పష్టంగా అర్థమవుతోంది కదా.. మెగా కాంపౌండ్ మీద పనిగట్టుకుని కొందరు ఎంతలా విషం చిమ్ముతున్నారో.! అసలు నేరం వీళ్ళది కాదు.. వీళ్ళకి చెల్లింపులు చేస్తూ, విషం చిమ్మిస్తున్నవాళ్ళది అసలు నేరం.!

The post అయ్యయ్యో.! ‘మెగా’ చిచ్చురేపాలనుకున్నారు.. బొక్క బోర్లా పడ్డారు.! appeared first on TeluguBulletin.com.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *