# Tags

Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్: అల్లు అరవింద్ పుత్రోత్సాహం.!

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్: అల్లు అరవింద్ పుత్రోత్సాహం.!

 

Allu Arjun: పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదే లే.! ఔను, అస్సలు తగ్గలేదు.! కోవిడ్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో వచ్చింది ‘పుష్ప’. సినిమాపై కొంత నెగెటివిటీ కూడా చూశాం. కొంతేంటి.? చాలా నెగెటివిటీ చూశాం.

అయినాగానీ, ‘పుష్ప ది రైజ్’ దుమ్మురేపింది వసూళ్ళ పరంగా. తెలుగునాట.. అందునా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా లాస్ వెంచర్.. అంటూ ప్రచారం జరిగింది. కానీ, నార్త్ బెల్ట్‌లో వసూళ్ళ ప్రభంజనమే చూశాం. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ అద్భుత విజయాన్ని అందుకుంది పుష్ప.

‘పుష్ప’ సినిమాలో నటనకుగాను, అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడిగా అరుదైన గౌరవం దక్కింది. 69వ అవార్డుల ప్రకటన తాజాగా జరిగింది. ఇన్నేళ్ళలో ‘ఉత్తమ నటుడు’ అవార్డు తెలుగు సినిమా పరిశ్రమకి రాలేదంటే, ఆశ్చర్యకరం లేదు. కానీ, ఇది నిష్టుర సత్యం. ఆ లోటుని, అల్లు అర్జున్ తీర్చేశాడు.

‘మా కుటుంబ గౌరవాన్ని మరింత పెంచాడు మా అబ్బాయ్..’ అంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, తన కుమారుడు అల్లు అర్జున్‌కి జాతీయ పురస్కారం రావడంపై ‘పుత్రోత్సాహం’ ప్రదర్శించారు మీడియా ముందర. ఇక, దర్శకుడు సుకుమార్ నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. అల్లు అర్జున్‌ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.

అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్.. వీళ్ళిద్దర్నీ చూస్తున్నవారంతా ఎమోషనల్ అయ్యారు. అభిమానుల కోలాహం అల్లు అర్జున్ ఇంటి ముందర కనిపించింది. పలువురు ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి సహా, జూనియర్ ఎన్టీయార్ తదితరులు అల్లు అర్జున్‌కీ అలాగే, జాతీయ పురస్కారాల్ని గెలుచుకున్న ఆయా సినిమాలు, అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని అభినందిస్తున్నారు.

ఒకప్పుడు జాతీయ పురస్కారాలంటే, తెలుగు సినిమాని చిన్న చూపు చూసేవి. కానీ, ఇప్పుడు తెలుగు సినిమాని వెతుక్కుంటూ జాతీయ పురస్కారాలొస్తున్నాయ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి వివిధ కేటగిరీల్లో మొత్తంగా ఆరు జాతీయ పురస్కారాలు వచ్చాయి. ‘పుష్ప’ సినిమాకి మొత్తంగా రెండు, ‘కొండ పొలం’, ‘ఉప్పెన’ చిత్రాలకి చెరొకటి పురస్కారాలు దక్కాయి.

మెగా.. మొత్తంగా మెగా.! అల్లు అర్జున్, పంజా వైష్ణవ్ తేజ్ చిత్రాలకు.. అలాగే, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకీ పురస్కారాలు రావడం.. ఇది నిజంగానే మెగా సంబరం.!

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *