# Tags

సినిమా స్టార్స్ రెమ్యునరేషన్లెంత.? వృధా అవుతున్న ప్రజాధనమెంత.?

సినిమా స్టార్స్ రెమ్యునరేషన్లెంత.? వృధా అవుతున్న ప్రజాధనమెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

మొన్నీమధ్యనే వైసీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డి, పార్లమెంటులో సినిమాటోగ్రఫీ శాఖ సంబంధిత చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడుతూ, సినిమా స్టార్ల రెమ్యునరేషన్లు.. సినిమా వ్యయాలు.. ఇలాంటి అంశంపై చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.

సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్లు చాలా ఎక్కువగా వుంటున్నాయనీ, నిర్మాణ వ్యయంలో సింహభాగం రెమ్యునరేషన్లేనని సెలవిచ్చారు విజయసాయిరెడ్డి. గత కొంతకాలంగా వైసీపీ నేతలు, సినిమా స్టార్ల రెమ్యునరేషన్ల గురించి చాలా చాలా బాధపడిపోతున్నారు. ఆ మాటకొస్తే కుళ్ళుకుంటున్నారు.

ఓ సినిమా చేస్తే, టాలీవుడ్‌లో అగ్రహీరోలనదగ్గరవారు 50 నుంచి 100 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని.. ఈ రెమ్యునరేషన్ ఇంకా పెరిగింది కూడా.! అక్కడే ఒళ్ళు మండిపోతోంది వైసీపీకి.!

సినీ పరిశ్రమని ఎలాగైనా లొంగదీసుకోవాలని వైసీపీ విశ్వప్రయత్నాలూ చేస్తోంది. కానీ, అది కుదరడంలేదు. ఎందుకంటే, తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌లో స్థిరపడింది. ఆ తెలుగు సినీ పరిశ్రమకి, తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. అది వైసీపీకి అస్సలు మింగుడుపడ్డంలేదు.

సినిమా స్టార్స్ సంగతి తర్వాత.. అసలంటూ, వృధా అవుతున్న ప్రజాధనమెంత.? వైసీపీ అధికారంలోకి వచ్చాక, పబ్లిసిటీ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చెంత.? సలహాదారులకు చెల్లిస్తున్న వేతనాలేంటి.? ప్రభుత్వం తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల కోర్టుల్లో కేసులు నమోదైతే, వాటి కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్నదెంత.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.

రాజధాని అమరావతి కేసుల్లో, ఖరీదైన లాయర్లను ప్రభుత్వం నియమించింది. అదో దండగ వ్యవహారం. మూడు రాజధానుల విషయంలో ఏం జరిగిందో చూశాం. మరి, ఆ వృధా మాటేమిటి.? ఇలాంటి అంశాలన్నీ తెరపైకొస్తాయ్.!

వృధా అవుతున్న ప్రజాధనంతో పోల్చితే, సినీ నటుల రెమ్యునరేషన్లు జస్ట్ జుజుబి.! అక్కడికి తానేదో ఉద్ధరించేసినట్లు విజయసాయిరెడ్డి ట్వీట్లేసుకుంటున్నారుగానీ.. ఆయన సినీ రంగం మీద చేస్తున్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు.!

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *