# Tags

వైసీపీని నిండా ముంచేస్తున్న పేర్ని, కొడాలి.!

వైసీపీని నిండా ముంచేస్తున్న పేర్ని, కొడాలి.!

వైసీపీని నిండా ముంచేస్తున్న పేర్ని, కొడాలి.!

మెగాస్టార్ చిరంజీవి, ఓ సినిమా ఈవెంట్‌లో సినీ పరిశ్రమ వ్యవహారాలపై మాట్లాడుతూ, నటీనటుల రెమ్యునరేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘ప్రత్యేక హోదా గురించీ, రోడ్ల గురించీ, ప్రజల బాగోగుల గురించీ ఆలోచించండి..’ అంటూ వ్యాఖ్యానించారు.

ఎక్కడా చిరంజీవి, వైసీపీ పేరు ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా తెచ్చింది లేదు.! కానీ, వైసీపీ ఉలిక్కిపడింది. నిజానికి, భుజాలు తడుముకుందని అనడం సబబేమో.! యాజ్ యూజువల్ కొడాలి నాని, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్.. ఒకరేమిటి.? వైసీపీ బెటాలియన్ మొత్తం రంగంలోకి దూకేసింది.

అంతకుముందు, కమెడియన్ హైపర్ ఆది, ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైసీపీ మీద సెటైర్లు వేశాడు. ఆయనా ఎవరి పేరునీ నేరుగా ప్రస్తావించలేదు.

గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడిమేసుకోవడమేంటి.? ‘తిట్టింది మమ్మల్నే..’ అని నిస్సిగ్గుగా మీడియా ముందుకొచ్చేయడమేంటి.? ‘సినీ పరిశ్రమలో పకోడీగాళ్ళు..’ అనేశారు కొడాలి నాని. పూర్వాశ్రమంలో ఆయనా సినీ నిర్మాతే. అంటే, ఆ పకోడీగాళ్ళ లిస్టులో నాని కూడా వున్నట్టేనా.?

పేర్ని నాని అయితే మరీనూ.! ప్రత్యేక హోదా విషయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా వుండి ఏం చేశారంటూ ప్రశ్నించేశారు. అది గతం. కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత వైసీపీ ఏం చేసింది.?

‘నేనూ చిరంజీవి అభిమానినే..’ అంటుంటారు పేర్ని నాని. అసలు చిరంజీవి అభిమాని అంటే, చిరంజీవిని విమర్శించే అవకాశం వుంటుందా.? పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ‘చిరంజీవి అభిమాని’ అనే ముసుగు, కింది స్థాయి.. చాలా కింది స్థాయి కార్యకర్తలు, నెటిజన్లు ఉపయోగిస్తే అదో లెక్క. కానీ, మాజీ మంత్రి.. వైసీపీ ఎమ్మెల్యే అలా నిస్సిగ్గుగా వాడేయొచ్చా.?

ఇవన్నీ వైసీపీని డ్యామేజ్ చేశాయ్.! దారుణంగా.. అత్యంత దారుణంగా డ్యామేజ్ చేశాయ్. గుడివాడ అమర్నాథ్ కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు.. చిరంజీవిని ఎంత విమర్శిస్తే, వైసీపీని అంతలా నాశనం చేసుకున్నట్టు.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇదంతా అర్థమవుతోందో లేదో.!

The post వైసీపీని నిండా ముంచేస్తున్న పేర్ని, కొడాలి.! appeared first on TeluguBulletin.com.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *