# Tags

మహిళా నేతలపై రాజకీయ జుగుప్స.! ఈ పాపం ఎవరిది.?

మహిళా నేతలపై రాజకీయ జుగుప్స.! ఈ పాపం ఎవరిది.?

తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మహిళా నేతలపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో దుష్ప్రచారం చేస్తూ, ఓ ‘ఈ-పేపర్’ లాంటిది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ‘మాకేం సంబంధం లేదు’ అని వైసీపీ అంటోంటే, ఆ పాపం వైసీపీదేనని టీడీపీ ఆరోపిస్తోంది.

ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కి చెందిన ఈ-పేపర్ తరహాలో దాన్ని డిజైన్ చేశారు. ఆయా మహిళా నేతల వ్యక్తిగత జీవితాలపై జుగుప్సాకరమైన కథనాలు అందులో వున్నాయి. అసభ్యకరం.. అత్యంత అసభ్యకరమైన రాతలవి.

నరనరానా రాజకీయ వైషమ్యాన్ని నింపుకున్నవారే అలాంటి రోత రాతల్ని రాయగలరు. ముమ్మాటికీ, ‘రాయడంలో సిద్ధహస్తుడైన’ ఓ పాత్రికేయుడి పనే అది.! లేకపోతే, అంతటి జుగుప్సాకరమైన రాతలు అంత పొందికగా ఎలా వస్తాయ్.?

‘అక్షర వ్యభిచారం’ అని కూడా దీన్ని అభివర్ణించొచ్చేమో.! గత కొంతకాలంగా రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న జుగుప్సాకరమైన ఆరోపణల్ని చూస్తున్నాం. వాటిని చూసి కొందరు పాత్రికేయం ముసుగులో ఇలాంటివి చేస్తున్నారా.? లేదంటే, ఆయా రాజకీయ పార్టీలే ఇలాంటి జుగుప్సాకరమైన రాతల్ని ప్రోత్సహిస్తున్నారా.?

మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ఎవరూూ తక్కువ కాదు.! ముఖ్యమంత్రి సైతం, అధికారిక బహిరంగ సభల్లోనూ, రాజకీయ ప్రత్యర్థుల పెళ్ళిళ్ళ గురించీ, భార్యల గురించీ మాట్లాడుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం.

పార్టీ అధినేతలు, ఉన్నత పదవుల్లో వున్నవారు సంయమనం పాటించనప్పుడు, మిగతా నాయకులు కావొచ్చు, కింది స్థాయి కార్యకర్తలు కావొచ్చు.. ఎందుకు పద్ధతిగా వుంటారు.? ప్రస్తుతానికైతే టీడీపీ మహిళా నేతల మీద జుగుప్సాకరమైన రాతలు బయటకు వచ్చాయి.

ఈ దుశ్చర్యకు వైసీపీ పాల్పడి వుంటే, దీన్ని జనసేనకు హెచ్చరికగానే భావించాలేమో.! ఎందుకంటే, వైసీపీకి ప్రస్తుతం ప్రధాన ప్రత్యర్థిగా జనసేన పార్టీనే మారుతోంది.

ఏ పార్టీ ఇలాంటివి చేసినా, చేయించినా.. అది నేరమే అవుతుంది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తున్నట్లయితే, తక్షణం ఈ జుగుప్సాకరమైన వ్యవహారానికి సంబంధించి, దోషుల్ని పట్టుకుని, చట్టం ముందు దోషిగా నిలబెట్టాల్సి వుంటుంది.

చిన్న చిన్న సోషల్ మీడియా పోస్టింగులకే అరెస్టులు జరుగుతున్న దరిమిలా, రాజకీయాల్లోకి మహిళలు రావాలంటేనే భయపడేలా తయారవుతున్న ఈ సరికొత్త జుగుప్సాకరమైన రాక్షసత్వాన్ని ‘మొక్క దశలోనే’ పీకి పారెయ్యాలి. లేదంటే, ఇది మహావృక్షంగా మారడానికి పెద్దగా సమయం పట్టదు.

అప్పుడిక, ఆడది స్వేచ్ఛగా కాదు.. ముసుగేసుకుని అయినా పట్టపగలు కూడా తిరగలేని దుస్థితి వస్తుంది.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *