# Tags

పెయిడ్ టైమ్స్.! జనసేనది 10 శాతం ఓటు బ్యాంకు.! దేనికి సంకేతం.?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరెస్టుకి రంగం సిద్ధం.?

రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఇమేజ్ పెంచడం కోసమంటూ నేషనల్ మీడియాకి పెద్దయెత్తున చెల్లింపులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ క్రమంలో అధికార పార్టీకి అనుకూలంగా ఆయా మీడియా సంస్థలు వ్యవహరించాలి కదా.! అదే జరుగుతోంది.

దాదాపు పది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించిన వైసీపీ సర్కారు, అందుకు అనుకూలంగా సర్వేల ఫలితాల్ని అందుకుంటోందన్న విమర్శల్లో వాస్తవం లేదని ఎలా భావించగలం.?

టైమ్స్ నౌ సంస్థ తాజాగా, వైసీపీకి రాష్ట్రంలో 24 ఎంపీ సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. టీడీపీకి ఓ సీటు వస్తే రావొచ్చునట. జనసేనకు గుండు సున్నా కొట్టేసింది ఆ సర్వే. కాస్త మొహమాటపడినట్టున్నారు.. లేకపోతే, పాతిక ఎంపీ సీట్లకు పాతిక ఎంపీ సీట్లనూ వైసీపీకి ఇచ్చేసేవారే.!

ఇక, వైసీపీ ఓటు బ్యాంకుని దాదాపు 51 శాతంగా పేర్కొన్నారు టైమ్స్ నౌ సర్వేలో. తెలుగుదేశం పార్టీకి ఓ ముప్ఫయ్ ఐదు శాతం ఓటు బ్యాంకుని కట్టబెట్టారు. చిత్రమైన విషయమేంటంటే, జనసేన పార్టీకి దాదాపు 10 శాతం ఓటు బ్యాంకుని ఇవ్వడం.

వైసీపీ అనుబంధ సర్వేలో, జనసేన పార్టీకి 10 శాతం ఓటు బ్యాంకు అంటే చిన్న విషయం కాదు. వాస్తవానికి, 97 శాతం వైసీపీకి.. రెండు శాతం టీడీపీకి, ఓ శాతం జనసేనకీ.. అని టైమ్స్ నౌ సంస్థ చెప్పి వుండాలి.! జనం తమ మొహాన ఉమ్మేస్తారని బహుశా టైమ్స్ నౌ నిర్వాహకులు తటపటాయించారేమో.!

2024 ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పోటీ చేస్తాయనీ, బీజేపీ కూడా అదే కూటమిలో వుంటుందనీ.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగానే, పొత్తుల చర్చలూ నడుస్తున్నాయి. జనసేన – బీజేపీ మధ్యన పొత్తు వుంది. బీజేపీకి అనుకూలంగానే చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.

మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వైసీపీ కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. మరి, ఏ ప్రాతిపదికన టైమ్స్ నౌ సంస్థ సర్వే చేసినట్లు.? కేవలం వైసీపీ శ్రేణుల్లోనే సర్వే చేస్తే, బహుశా ఈ ఫలితాలు వచ్చి వుండొచ్చన్నది ఓ వాదన.!

డబ్బులు ఖర్చు చేస్తే ఇలాంటి సర్వేలు పూటకొకటి వెలుగు చూస్తాయ్.! రాష్ట్ర ఇమేజ్ పెంచమని కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.. అదీ ప్రజాధనం.! దురదృష్టమేంటంటే, ఆ ప్రజాధనంతో, ప్రైవేటు సర్వేలు నడుస్తున్నాయ్.. అదీ వైసీపీకి అనుకూలంగా తీర్పులు ఇచ్చేస్తూ.!

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *