# Tags

తెగులు మాఫియా.! డౌటేముంది.? ఇది మీడియా కాదు.!

తెగులు మాఫియా.! డౌటేముంది.? ఇది మీడియా కాదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

పాత్రికేయం తెలుగునాట ఇంకా వుందా.? అన్న అనుమానాలు కలుగుతుంటాయ్.! ఔను, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు బట్టలిప్పేసింది ఓ ప్రముఖ దినపత్రిక.. అదీ కార్టూన్ రూపంలో.! ఇది చూశాక, మీడియా ఎక్కడుంది.? అంతా మాఫియానే అన్న భావన చాలామందిలో కలిగింది.

కానీ, చరిత్రలోకి తొంగి చూస్తే, అసలు మాఫియా అనేది ఇప్పుుడు కాదు, ఎప్పుడో ఎంటరైపోయింది తెలుగు మీడియాలోకి.. అన్న విషయం అర్థమవుతుంది. అది, స్వర్గీయ ఎన్టీయార్ మీద చంద్రబాబు అండ్ టీమ్ కత్తులు నూరుతున్న సమయం. ఆ వెన్నుపోటు రాజకీయాలకు ఈనాడు గ్రూపు సంస్థ అధినేత రామోజీరావు ఆజ్యం పోస్తున్న సమయం.

స్వర్గీయ ఎన్టీయార్ బట్టలూడదీసి పత్రికలో నిలబెట్టింది ఈనాడు.. అదీ కార్టూన్ రూపంలో. అవిప్పటికీ ఇంటర్నెట్‌లో అందుబాటులోనే వున్నాయి. అవి చూశాక, ఇప్పుడు తాజాగా సాక్షిలో కనిపించిన రామోజీరావు ‘నగ్న కార్టూన్’ పెద్దగా ఇబ్బందికరంగా అనిపించదు.

స్వర్గీయ ఎన్టీయార్ అంటే రాజకీయ నాయకుడు.. రాజకీయాల్లో వున్నాక ఏమైనా అంటాం.. అనే వాదనా సరైనది కాదు. రాజకీయ నాయకుడైనా, మీడియా సంస్థ అధిపతి అయినా, సినీ నటులైనా.. మీడియా ఇలా కించపర్చకూడదు. కార్టూన్లలో అయినా నగ్నత్వానికీ ఓ హద్దు వుంటుంది కదా.!

గత కొంతకాలంగా వైసీపీ సర్కారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు రామోజీరావు, తమ ఈనాడు పత్రిక ద్వారా. అదే సమయంలో, రామోజీరావుకీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వైసీపీ సర్కారు, ‘మార్గదర్శి’ కుంభకోణం నేపథ్యంలో.

ఇద్దరు వ్యక్తుల మధ్య.. రెండు మీడియా సంస్థల మధ్య ఆధిపత్య పోరు కాస్తా.. ఇదిగో, ఈ స్థాయికి దిగజారింది. రేప్పొద్దున్న ఈనాడులో వైఎస్ జగన్ నగ్న కార్టూన్ వస్తేనో.? అందులో వింతేముంది.? వచ్చినా రావొచ్చు.!

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *