# Tags

తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన హైపర్ ఆది

తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన హైపర్ ఆది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో.. అందులో టీం లీడర్ అయిన హైపర్ ఆది( Hyper Aadi) కూడా అంతే ఫేమస్ అయ్యాడు. స్కిట్లలో తనదైన కామెడీ పంచులు విసురుతూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు. తాజాగా పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లపై కూడా తన హవా సాగిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఆది ప్రేమ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. కొంతకాలంగా తను ఓ యాంకర్ తో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ ఓ షో లో తన గర్ల్ ఫ్రెండ్ ని హైపర్ ఆది పరిచయం చేశాడు.

షో లో పాల్గొన్న ఆది స్టేజ్ పై మాట్లాడుతూ… తను కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తనని పరిచయం చేస్తానని ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిచాడు. షో లో భాగంగా ఎంతో మందిని ప్రేమించినట్లు చెప్పినా తాను నిజంగా ప్రేమించింది ఒక్క అమ్మాయినేనని ఆ అమ్మాయి తనేనని పరిచయం చేశాడు. ‘ లవ్ యు విహారిక అంటూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ‘లవ్ యు టూ’ ఆది అంటూ రిప్లై ఇచ్చింది.

గతంలోనూ తాను పెళ్లి చేసుకునే అమ్మాయి తనేనంటూ పలు షో ల్లో కొంతమంది అమ్మాయిల్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత అవి షోలో భాగమే అని తేలిపోయేవి. అయితే ఈసారి పరిచయం చేసిన విహారికని మాత్రం ఏ షోలోను చూడలేదు. కాబట్టి తను నిజంగా ఆది గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా నిజమో కాదో తేలాలంటే ఆ షో ప్రసారం అయ్యేవరకు ఆగాల్సిందే.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *