# Tags

చంద్రయాన్ బడ్జెట్ వర్సెస్ ‘సాక్షి’ ప్రకటనల ఖర్చు.!

చంద్రయాన్ బడ్జెట్ వర్సెస్ ‘సాక్షి’ ప్రకటనల ఖర్చు.!

 

చంద్రయాన్ ప్రాజెక్ట్ విజయవంతమైంది.! అదిప్పుడు, దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆలోచింపజేస్తోంది.! ప్రస్తుత రాజకీయాలకి చంద్రయాన్ ప్రాజెక్టుని అన్వయించి చూస్తున్నారు ప్రజానీకం.! తెలుగునాట.. అందునా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, చంద్రయాన్ ప్రాజెక్టు విషయమై మరింత లోతైన చర్చ జరుగుతోంది.. అదీ రాజకీయంగా.!

‘ఆదిపురుష్’ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ‘చంద్రయాన్’ ప్రాజెక్టు ఖర్చు.. అంటూ ఓ వాదన తెరపైకొచ్చింది. అదీ నిజమే.! ‘జైలర్’ సినిమా వసూళ్ళ కంటే తక్కువ ఖర్చుతోనే, ‘చంద్రయాన్’ ప్రాజెక్టు పూర్తయిపోయింది.. అనే వాదనా వినిపిస్తోంది.! ఇదీ కొంతవరకు నిజమే.!

ఇవన్నీ సినిమా సంబంధిత పోలికలు. రాజకీయాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కారు, ‘సాక్షి’ పత్రికకు గడచిన నాలుగేళ్ళలో వివిధ రూపాల్లో సమర్పించుకున్నది.. దాదాపు వెయ్యి కోట్లన్నది జనబాహుళ్యంలో జరుగుతున్న చర్చ.

సాక్షి పత్రికకు ఇస్తున్న ప్రకటనలే కాదు, వాలంటీర్లకు సాక్షి పత్రిక మాత్రమే ఇవ్వడం ద్వారా, దానికోసం చేస్తోన్న చెల్లింపుల్నీ ఇందులో జనం ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన పార్టీ, సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.! ఔను కదా.. ఇదీ ప్రజాధనమే కదా.? అన్న చర్చ జనంలో గట్టిగా జరుగుతోంది.

చంద్రయాన్ కోసం ఆరొందల కోట్లు ఖర్చ పెట్టడం సబబే.! కానీ, సాక్షి పత్రిక కోసం వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు ఖర్చు చేశారు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది కదా. మరి, ఈ విషయమై అధికార వైసీపీ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటుందో చూాలి.!

సహజంగానే, పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంపాదిస్తున్న సంపాదన గురించో, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించో.. వైసీపీ నేతలు మాట్లాడుతూ, టాపిక్‌ని డైవర్ట్ చేస్తారేమో.!

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *