# Tags

కొడాలి నాని చేసిన మెగా మంచి పని ఇదే.!

Kodali Nani Fire On Chandrababu Naidu For Kodela Siva Prasad Suicide

మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు మాజీ మంత్రి, వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.! 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి మెగాభిమానులంతా సంపూర్ణ మద్దతు పలికేందుకు కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు ఉపయోగపడేలా వున్నాయ్.

కొడాలి నాని అన్నారనో.. ఇంకెవరో అన్నారనో కాదుగానీ, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ వెంట నడవాలని మెగా ఫ్యాన్స్ ఇప్పటిక తీర్మానించుకున్నారు. ఈ దిశగా నాగబాబు, మెగాభిమానులందర్నీ ఒక్కతాటిపైకి తెస్తున్నారు కూడా.! అయితే, ఆ మెగాభిమానుల్లో మరింతగా జనసేన పార్టీ పట్ల అభిమానం పెరిగేలా, వైసీపీ నేతలు పరోక్షంగా సాయం చేస్తున్నట్లే భావించాలి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతల విమర్శలు మామూలే. కానీ, చిరంజీవి మీద కూడా వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. అవీ అత్యంత జుగుప్సాకరంగా వున్నాయి. అంబటి రాంబాబు కావొచ్చు, పేర్ని నాని కావొచ్చు, కొడాలి నాని, రోజా తదితరులు కావొచ్చు.. చిరంజీవిపై చేస్తున్న విమర్శలు, మెగాభిమానుల్ని బాధపడుతున్నా, వారిలో మరింత ‘పట్టుదల’ని పెంచుతున్నాయి.

గత కొద్ది రోజులుగా గ్రౌండ్ లెవల్‌లో జనసేన పార్టీ తరఫున మెగాభిమానులు మరింత యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ‘అబ్బే, నేను చిరంజీవిగారిని ఏమీ అనలేదు. చిరంజీవిని విమర్శిస్తే రాజకీయంగా ఏం జరుగుతుందో మాకు తెలుసు..’ అని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో.. రాజకీయాల్లో మరింత యాక్టివ్ అవ్వాలనే నిర్ణయానికి మెగాభిమానులు కొందరు వచ్చేశారు.
ఇప్పటిదాకా రాజకీయాల విషయమై కాస్త స్తబ్దుగా వున్న మెగాభిమానులు, గత కొద్ది రోజులుగా వైసీపీ నేతల తీరుతో కలత చెంది, పూర్తి యాక్టివ్ అవడం పట్ల జనసేన శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతకీ, కొడాలి నాని కొన్నాళ్ళ క్రితం చిరంజీవిని తూలనాడి, ఇప్పుడు చిరంజీవి మీద మమకారం ప్రదర్శించడానికి కారణమేంటి.? వైసీపీకి ఆయన వెన్నుపోటు పొడుస్తున్నారా.? ముందు ముందు చిరంజీవి, రాజకీయ నిర్ణయం ఎలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *