# Tags

చంద్రబాబు గారి అరెస్ట్: కాశీ విశ్వనాధ్ యనమదలు మన ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ

సినిమా దర్శకులు..నటుడు కాశీ విశ్వనాధ్ యనమదల వారి ఆవేదన CBN గారి గురించి.. మన ఆంధ్రప్రదేశ్ గురించి

గౌరవనీయులు.. తెలంగాణా ఐటీ మంత్రి శ్రీ కె.టి.ఆర్ గారికి..
నమస్కారం సార్!
హైదరరాబాద్ లో నివాసమున్న ఆంధ్రా సెటిలర్స్ అందరి తరపున మీకు
వై కాశీ విశ్వనాధ్ విన్నపం..

ఆంధ్రప్రధేశ్ లో గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు..
దేశ విదేశాలలోని..తెలుగు ప్రజలందరి మనస్సుల్లో ఎంతో విలువున్న.. నాయకుడు.. విజన్ వున్న నాయకుడు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఓ చిన్న ఎలిగేషన్ తో అరెస్ట్ చేసి.. జైల్ రిమాండ్ లో వుంచిన విషయంలో తెలంగాణా ప్రభుత్వం స్పందించిన విధానం సరిగ్గా లేదనే భావం మీ శ్రేయోభిలాషినైన
నాకు కలిగింది సార్ !

ఎన్నో సంవత్సరాలు ఆంధ్రా..తెలంగాణా రాష్ట్రాల ప్రజలు.. ఒకే ఫ్యామిలిలా కలిసివున్నారు. తెలంగాణా సెంటిమెంట్ తో రాష్ట్రాలు విడిపోయినా..అన్నదమ్మలుగా కలసివుండాలని చెప్పి..ఇప్పుడు పక్క రాష్ట్రం పంచాయితీ మాకెందుకు.. అని తప్పించుకోడం అన్యాయం సార్ !

I.T ఉద్యోగులు తెలిపిన నిరసనకు..కనీసం మీవంతు సహకారం.. మీరు అందించి వుంటే.. సెటిలర్స్ మనసుల్లో మీరు.. చిరస్తాయిగా.. సెటిల్ అయ్యి.. వుండేవారు సార్.
రాజకీయాలలో.. యుక్తితో ఎన్ని వ్యూహాలైనా వేసుకోవచ్చు గాని.. ఇలాంటి దయనీయ పరిస్తితులలో.. ఒక పెద్దాయనని జైలులో పెట్టినపుడు..
దయార్ధ హృదయంతో చూడాలి. కక్ష పూరిత ధోరణితో కాకుండా కనికరంతో.. ఆలోచించాలి.
ఆయన వయసును.. ఆయన ఆరోగ్యాన్ని.. ఆయన అనుభవాన్ని.. అయినా దృష్టిలో వుంచుకోవాలి కదా! ఎంతయినా.. మీ నాన్న గారు..

శ్రీ కె.సి.ఆర్ గారి “మూలం” తెలుగు దేశం పార్టీనే కదా..
ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో.. మంత్రిగా పని చేసిన వారే కదా..? అ సెంటిమెంటైనా వుండాలి కదండీ !
ఎన్నో ఏళ్ళుగా.. మహావృక్షం లా పెరిగిన..
శ్రీ ధీరూభాయి అంబానీ గారి.. రిలయన్స్ సామ్రాజ్యం విషయంలో గొడవలొచ్చి.. అనిల్ అంబానీ గారు.. ముఖేష్ అంబానీ గారు విడిపోయారు. అప్పుడు
అనిల్ అంబానీ గారు ఫైనాన్సియల్ క్రైసిస్ లో పడినపుడు.. తమ్ముడు ముఖేష్ అంబానీ గారు.. నాకెందుకులే అని వదిలేశారా..,? అడ్డంపడి ఆదుకోలేదా..?
ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో.. మీ ‘వైఖరి’ హైదరాబాద్ లో.. నివాసమున్న ప్రతి సెటిలర్ కీ.. ఎంతో మనస్తాపాన్ని కలిగించింది.
దీని ప్రభావం వచ్చే ఎలక్షన్స్ లో.. చాలా నెగెటివ్ గా వుండే అవకాశం వుంది. కాబట్టి.. ఇప్పటికైనా..
గౌరవ తెలంగాణా ముఖ్యమంత్రి..
శ్రీ K.C.R. గారు చొరవ తీసుకుని.. చంద్రబాబు నాయుడు గారిని.. జైలు నుంచి బయటకు తీసుకురావటంలో.. సహకరించాలని.. నా విన్నపం.

హైదరాబాద్ ని ఒక పాడి ఆవులాగ అభివృధ్ది చేసిందీ శ్రీ చంద్రబాబు నాయుడు గారే అని మీకూ తెలుసు.. మాకూ తెలుసు. రాష్ట్రాల పంపకంలో మాత్రం.. పాలిచ్చే.. “పొదుగు” మీకు వచ్చింది…మేత పెట్టాల్సిన “తలకాయ” చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది.
ఆయినా.. ఆయన మొక్కవోని ధైర్యంతో.. విడిపోయి.. వీక్ గా వున్న రాజధాని లేని.. రాష్ట్రాన్ని అభివృధ్ది చేయడానికి శతవిదాల ప్రయత్నిస్తుంటే.. అపోజిషన్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు. అటంకాలు సృష్టించారు.
ఇవన్నీ మీకు తెలియనివి కాదు.
కురుక్షేత్రంలో.. ధర్మరాజు రక్తం ఒక్కో బొట్టు నేల మీద పడితే.. కౌరవులకు.. ఎంతో “అరిష్టం”
అని చెప్తారు.. అలాగే చంద్రబాబు నాయుడు గారిని..
జైలు “రిమాండ్” ని.. ఒక్కోక్క రోజు పెంచుకుంటూ పోతే..
ఆ ప్రభావం.. వచ్చే ఎన్నికలలో.. తెలంగాలో.. T.R.S. మీద, ఆంధ్రాలో.. Y.C.P. మీద
రెండు రాష్ట్రాలోనూ..B.J.P. మీద ఖచ్చితంగా ప్రతికూలంగా వుంటుందని.. నా అభిప్రాయం.
తప్పులు ఎవరు చేయరు సార్.
సమాజంలో.. తప్పు చేయని మనిషి గాని, కుటుంబం గాని,
ప్రజలు గాని.. చివరికి.. ప్రభుత్వాలు గాని.. వుంటాయా సార్ ! సమయాన్ని బట్టి.. పరిస్తితులను బట్టి.. సర్దుకోవాలి.. సరిచేసుకోవాలి. అయినా ఆయనను తప్పు చేయకుండానే అరెస్ట్ చేశారు.
ఇకనైనా మించిపోయింది ఏమీలేదు. జుడీషియల్ ఇష్యూలో ఎంటర్ అవ్వడానికి కొన్ని లిమిట్స్ వుండవచ్చు.. కానీ మానవీయ కోణంలో ఆలోచించి.. చంద్రబాబు గారిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే విషయంలో… మీరు మోరల్ సపోర్టు ఇచ్చి..
ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని.. నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Please sir… Respond soon.

థాంక్యూ సార్!

మీ
కాశీ విశ్వనాధ్

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *